|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 11:21 PM
యాదవుల నాయకులను సీఎం జగన్‌రెడ్డి అవమానించారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. శనివారం నాడు జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యాదవులకు వైసీపీ మొండిచేయి చూపించద్దన్నారు. రెడ్లు నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, అక్కరమాని విజయనిర్మలకు నమ్మించి ద్రోహం చేశారన్నారు.ఉరకూటి చందును...టికెట్ల ఇచ్చే ముందు రోజు ఎందుకు తప్పించారని ప్రశ్నించారు. మేయర్‌కు సీటు ఉందని నమ్మించి మోసం చేశారన్నారు.ఉత్తరాంధ్రలో యాదవులకి టికెట్ ఇవ్వడానికి చేతులు రాలేదా అని నిలదీశారు. యాదవులను మోసం చేసిన మోసగాడు జగన్ అన్నారు. వైఎస్సార్ బీసీల పార్టీ కాదని.. బీసీలకు ద్రోహం చేసే పార్టీ అని చెప్పారు. సిద్ధం సభలో బీసీలకు అండగా ఉంటానని మాట తప్పారన్నారు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో బీసీలు అంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌లా కనిపిస్తున్నారు కానీ వాళ్లే టాపర్‌గా నిలుస్తారని పీతల మూర్తి యాదవ్ చెప్పారు.
Latest News