|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 12:26 PM
జనసేనాని పవన్ కళ్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. శనివారం కిర్లంపూడిలో ముద్రగడ మాట్లాడుతూ.. ‘వైసీపీ వ్యవస్థాపకుల్లో నేనూ ఒకడిని. కొన్ని శక్తులు నన్ను సీఎం నుంచి దూరం చేశాయి.
రాజకీయాల్లో మొలతాడు లేనివాడు ఇప్పుడు నాకు పాఠాలు చెబుతున్నాడు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పవన్ ఎక్కడ ఉన్నాడు. కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదు. పవన్ సినిమాల్లో హీరో కావొచ్చు. కానీ రాజకీయాల్లో మాత్రం నేనే హీరోని.’ అని అన్నారు.