|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 12:25 PM
మరికాసేపట్లో వైసీపీ 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్థులను ప్రకటించనుంది. సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు చేరుకుంటారు. మధ్యాహ్నాం 12.58 గంటలకు వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు.
ఇప్పటివరకు 68 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను వైసీపీ మార్చింది. సీఎం జగన్ సమక్షంలో మంత్రులు ధర్మాన, నందిగం సురేష్ అభ్యర్థులను ప్రకటించనున్నారు.