|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 11:04 AM
పెండింగ్ స్థానాల అభ్యర్థుల ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పార్టీలో కొందరు సీనియర్లకు సీట్లు కేటాయించకపోవడంతో పలు చోట్ల ఆందోళనలు రేకెత్తాయి. దాంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైంది.
ఇవాళ, రేపటిలోగా టీడీపీ ఎంపీ అభ్యర్థులతో పాటు పెండింగ్ స్థానాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. సీట్లు దక్కని సీనియర్లకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చంద్రబాబు తెలిపారు.