|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 09:23 PM
తుర్కియేలోని ఇమ్‌బ్రోస్ దీవి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. టర్కీ తీరంలో పడవ బోల్తా పడటంతో ఐదుగురు చిన్నారులతో సహా 21 మంది వలసదారులు చనిపోయారు. ఈ విషయాన్నీ స్థానిక అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ ఘటనలో మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ప్రయాణికుల కోసం గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ దేశానికి ఎక్కువ సిరియా నుంచి వలస వస్తుంటారు.
Latest News