|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 04:04 PM
నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి సిద్ధమయ్యారు. శుక్రవారం మరి కాసేపట్లో రాజీనామా ప్రకటన చేయునున్నట్లు సమాచారం. 2014, 2019 ఎన్నికల్లో కావలి, ఉదయగిరిలో వైసీపీ గెలుపు కోసం వంటేరు పనిచేశారు. ఈ క్రమంలో ఎంపీ వేమిరెడ్డితో కలిసి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో అనుచరులతో సహా టీడీపీలో చేరనున్నారు. వంటేరు వేణుగోపాల్ రెడ్డి రాజీనామా నిర్ణయంతో కావలి, ఉదయగిరి వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.
Latest News