|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 02:45 PM
యాడికి మండల కేంద్రంలో టెంకాయల విక్రయ హక్కు వేలం, హుండీ కానుకల ద్వారా రూ. 3, 69, 602 ఆదాయం వచ్చినట్లు చెన్నకేశవస్వామి ఆలయ ఈఓ దుర్గా ప్రసాద్ తెలిపారు. టెంకాయల విక్రయ హక్కు వేలంలో మండల కేంద్రానికి చెందిన చిన్నోడు రూ. 2, 01, 000 దక్కించుకున్నారు. ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకూ మండల కేంద్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దుర్గా ప్రసాద్ తెలిపారు.
Latest News