|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 01:15 PM
టాలీవుడ్ డైరెక్టర్, తన స్నేహితుడు త్రివిక్రమ్ గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. మంగళగిరిలోని జనసేన సెంట్రల్ ఆఫీస్‌లో మాట్లాడిన పవన్.. రానున్న ఎన్నికల్లో జగన్‌ను ఓడించడం, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపొందాల్సిన అవశ్యకతను వివరించారు. ఇదే సమయంలో త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు పవన్ కల్యాణ్. 2019లో 30 స్థానాల్లో పోటీ చేద్దామనుకుంటే.. తనపై కొందరు ఒత్తిడి తెచ్చారని అన్నారు. గాజువాకలో తాను కూడా ఓడిపోతున్నట్లుగా ముందే తెలిసిందన్నారు. ఇక భీమవరంలో కూడా ప్రచారం ముగించగానే ఓటమి తప్పదని అర్థమైందన్నారు. కానీ, దేవుడు ఆజ్ఞ మేరకు ముందుకు కదిలానన్నారు. ‘కర్మ యోగివి.. బాధ్యతలు నిర్వర్తించు.. అని దేవుడు చెప్పాడు’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆ సమయంలో పార్టీని ఎలా నడపాలో కూడా తెలియని సందిగ్దంలో ఉన్నానన్నారు.
Latest News