|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 12:57 PM
ఈ నెల 15 నుంచి ఏపీ ఈసెట్-2024 దరఖాస్తులు ప్రారంభిస్తున్నట్లు అనంతపురం జేఎన్‌టీయూ ఉపకులపతి ఆచార్య శ్రీనివాసరావు వెల్లడించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
మే 8న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మే 10న ప్రాథమిక కీ విడుదల చేసి, 12 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అనంతరం ఫలితాలు విడుదల చేస్తామన్నారు.