|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 12:47 PM
పుంగనూరు పట్టణంలో వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మకు శుక్రవారం సందర్భంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృత అభిషేకాలను నిర్వహించి పలు రకాల పుష్పాలు, బఠానీలు, ఉసిరికాయలతో ప్రత్యేక అలంకరణ చేశారు. మండలంలోని పలు ప్రదేశాల నుంచి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మహిళలు పిండి దీపాలు వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు.
Latest News