|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 03:17 PM
నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఒక ఆశయం కోసం వచ్చినవాడిని.. ఓడిపోతే శూన్యమనిపించిందని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అధికారం కోసం కాదు.. మార్పు కోసం వచ్చానని అన్నారు. అన్యాయం జరిగితే సగటు మనిషి తిరగబడేలా ధైర్యం ఇచ్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. అధికారంలో ఉన్న మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అనిపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.