|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 11:55 AM
పౌరసత్వ(సవరణ)చట్టం(CAA)–2019కింద భారత పౌరసత్వం పొందాలనుకునే శరణార్ధులకు సాయపడేందుకు త్వరలో హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ పేర్కొంది.
ఆన్‌లైన్ వేదికగా దరఖాస్తు ప్రక్రియ జరుగుతుందని హోంశాఖ ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టింది. దరఖాస్తుల సమర్పణకు ఇప్పటికే పోర్టల్‌ను సిద్ధం చేసినట్లు గుర్తుచేసింది. ప్రతిరోజూ ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఈ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయి.