2018 గ్రూప్-1 నోటిఫికేషన్ లో కీలక నిర్ణయం
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 09:43 PM

ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ఆధారంగా మెయిన్స్ పరీక్ష రాసి ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. పరీక్ష పేపర్లను రెండవసారి, మూడవసారి మూల్యాంకనం చేయడం చట్టవిరుద్దమని హైకోర్ట్ ప్రకటించింది. పరీక్షను తాజాగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష నిర్వహణ, ఎంపిక ప్రక్రియను 6 వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. 2018 గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యర్థులు ఆందోళన చెందవద్దని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్నవారి ప్రయోజనాలను కాపాడుతామని హామీ ఇచ్చింది. వారి తరపున న్యాయపోరాటం చేస్తామని, హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని హామీ ఇచ్చింది. తీర్పుపై ఎవరికీ ఆందోళన అవసరం లేదని, వారి ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఈ సందర్భంగా పేర్కొంది.

Latest News
Tank shell explosion kills three Japanese defence personnel Tue, Apr 21, 2026, 05:14 PM
Revanth Reddy-KCR's war of words generates political heat in Telangana Tue, Apr 21, 2026, 05:13 PM
Defence Ministry inks Rs 975 crore contracts for TRAWL Assembly for T-72, T-90 tanks Tue, Apr 21, 2026, 05:03 PM
Global rights group highlights growing restrictions on civil liberties in Pakistan Tue, Apr 21, 2026, 05:01 PM
Delhi Police bust spurious ENO, counterfeit Nescafe racket in Madhu Vihar; goods worth Rs 20 lakh seized Tue, Apr 21, 2026, 04:59 PM