|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 04:22 PM
గీతాంజలిది ఆత్మహత్య కాదు...టీడీపీ, జనసేన సోషల్‌మీడియా చేసిన హత్య అని ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి కుటుంబంలోని లబ్దిదారులే స్టార్ క్యాంపెనర్లు అని సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చెబుతుంటారు. ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధిని చెప్పిన గీతాంజలి నోరు నొక్కితే ఇంకెవరూ నోరు విప్పరు అనే కుట్రతో ఆమెను ట్రోల్ చేశారు. సీఎం జగన్ చేసిన మంచిని ఎవరూ చెప్పకూడదనే ఆమె జీవితాన్ని అంతం చేశారు. సోషల్ మీడియాలో మహిళలు ఎవరూ మాట్లాడకూడదనే వారి కుట్ర అని అన్నారు.
Latest News