|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 04:21 PM
అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గ టీడీపీ నేత గండి రవికుమార్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో గండి రవికుమార్‌తో పాటు స్థానిక టీడీపీ నేత డెడ్డెం ప్రసాదరావు పార్టీలో చేరారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ వారికి వైయస్ఆర్ సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, వైయస్‌ఆర్‌సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ భగవాన్ జయరామ్ పాల్గొన్నారు.
Latest News