తెలుగు కవయిత్రికి నివాళులు అర్పించిన సీఎం జగన్
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 04:14 PM

16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతి సందర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి సీఎం వైయ‌స్‌ జగన్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆమె సేవ‌ల‌ను, క‌విత‌ల‌ను ముఖ్య‌మంత్రి గుర్తు చేసుకున్నారు. కాగా, ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతిని ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌లు వరుదు కళ్యాణి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ఏపీ శాలివాహన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మండేపూడి పురుషోత్తం పాల్గొని నివాళుల‌ర్పించారు.

Latest News
IPL 2026: When and Where to watch LSG vs KKR, know all details Sat, Apr 25, 2026, 04:14 PM
Tablet-based cancer treatments emerging as promising alternative to chemotherapy, says Vice President in Jaipur Sat, Apr 25, 2026, 03:27 PM
Haven't seen myself, can't say where it came from: Ex-Army chief on Rahul's claims about unpublished book Sat, Apr 25, 2026, 03:18 PM
India's bio-economy projected to touch $1 trillion by 2047: Minister Sat, Apr 25, 2026, 03:15 PM
Technology is reshaping trading, distribution and advice: SEBI Chairman Sat, Apr 25, 2026, 03:14 PM