|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 02:59 PM
వైసీపీలో ఇన్ చార్జ్ ల మార్పు కసరత్తు కొనసాగుతోంది. వైసిపి ఫస్ట్ లిస్టులో చిలకలూరిపేట ఇన్ చార్జ్ గా నియమితులైన మల్లెల రాజేష్ పదవి 12 వ జాబితాలో ఊడిపోయింది. దీంతో పొరుగునే ఉన్న పర్చూరు, చీరాల వైసిపి ఇన్ చార్జీలు డైలమోలో పడ్డారు. పర్చూరు ఇన్ చార్జీగా ఇటీవలే చీరాలకు చెందిన యడం బాలాజీ నియమితులు కాగా ఆయన మీద చిలకలూరిపేట ఎఫెక్ట్ బలంగా పడింది. చీరాల ఇన్చార్జి కరణం వెంకటేష్ కు కూడా ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు.
Latest News