|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 04:33 PM
6100 మంది ఉపాధ్యాయుల నియామకం కోసం చేపట్టిన డీఎస్సీ 2024లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 25 వరకు ఆన్‌లైన్‌లో సర్కార్ దరఖాస్తులను స్వీకరించింది. గత షెడ్యూల్ ప్రకారం ఈనెల 15 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే హైకోర్టులో ఎదురైన న్యాయపరమైన చిక్కుల వల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ మార్పును డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నవారు గమనించాలని విజ్ఙప్తి చేసింది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హతలను మార్చడం, టెట్ పరీక్షకు, డీఎస్సీ పరీక్షకు మధ్య సమయం ఇవ్వాలని న్యాయస్థానాలు సూచించడంతో షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. సెంటర్లు ఎంపిక చేసుకోవడానకి వెబ్ అప్షన్ల ద్వారా అభ్యర్ధులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాగా.. ఏడు మేనేజ్‌మెంట్ల పరిధిలో 6100 పోస్టులతో డీఎస్సీని గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఎస్‌ఈటీ - 2280 , స్కూల్ అసిస్టెంట్స్ - 2299, టీజీటీ - 1264, పీజీటీ - 215, ప్రిన్సిపల్స్ - 42 చొప్పున ఉద్యోగాలు ఉన్నాయి.
Latest News