|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 02:01 PM
టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ స్థానాలతో పాటు 10 అసెంబ్లీ సెగ్మెంట్లను కేటాయించారు. బీజేపీ పోటీచేసే స్థానాలు, అభ్యర్థుల ఎంపిక ఖరారైనట్లు తెలుస్తోంది. రాజమండ్రి నుంచి పురందేశ్వరి,
అనకాపల్లి నుంచి సీఎం రమేశ్, అరకు నుంచి కొత్తపల్లి గీత, తిరుపతి నుంచి విశ్రాంత ఐఏఎస్ రత్నప్రభ, నరసాపురం నుంచి రఘురామ కృష్ణరాజు, విజయనగరం నుంచి పీవీఎన్ మాధవ్ ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉంటారని టాక్.