ఆనందంలో ఆ ప్రజలు
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:35 PM

సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో విజయవాడలో ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న కృష్ణా నదిని ఆనుకొని ఉన్న కాలనీ­ల్లోని 80 వేల మందికి వరద ముంపు బాధ తప్పింది. కృష్ణా నదికి కొద్దిపాటి వరద వచ్చి బ్యారేజి నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారంటేనే నగరంలోని కృష్ణలంక రణదీర్‌నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్‌గుప్తానగర్, పోలీస్‌కాలనీ, రామలింగేశ్వరనగర్‌ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రాంతాలు మునిగినట్టే. దీంతో వరద మొద­లవగానే ఈ ప్రాంతాల ప్రజలు సామా­న్ల­తో సహా సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలిపోయేవారు. నేడు 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చుక్క నీరు కూడా ఇళ్లలోకి రాకుండా రూ.369.89 కోట్లతో 2.26 కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మించారు. అంతేకాదు.. ఆ రక్షణ గోడ వెంబడి రూ.12.3 కోట్లతో రివర్‌ఫ్రంట్‌ పార్కును అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో, వాకింగ్‌ ట్రాక్‌తో కూడిన ఈ పెద్ద పార్కు ఇప్పుడు నగరవాసులకు మంచి సందర్శనీయ ప్రాంతంగా మారనుంది. రక్షణ గోడ­ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మంగళవారం జాతికి అంకితం చేసి,  రివర్‌ఫ్రంట్‌ పార్కును ప్రారంభించనున్నారు.  

Latest News
'Mamata-led TMC government worse than CPM', says BJP's Suvendu Adhikari Wed, May 06, 2026, 02:53 PM
Don't adopt Trinamool culture of post-poll violence after victory: Suvendu Adhikari to party workers Wed, May 06, 2026, 02:50 PM
Gold, silver prices gain up to 3 pc on weak dollar, oil prices Wed, May 06, 2026, 02:48 PM
Ahmedabad to host IPL 2026 finale on May 31 as BCCI unveils playoffs schedule Wed, May 06, 2026, 02:42 PM
Excited to build stronger ties: US Ambassador ahead of Marco Rubio's India visit Wed, May 06, 2026, 02:27 PM