|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:51 AM
గుంతకల్లు నియోజకవర్గం అసెంబ్లీ టిడిపి టికెట్టు పేకాట, భూకబ్జాలు మంత్రిగా పేరుగాంచిన గుమ్మనూరు జయరాంకు ఇవ్వరాదని టిడిపి లీగల్ సెల్ నాయకులు పేర్కొన్నారు. సోమవారం గుంతకల్లు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, హేమాద్రి తదితరులు సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గుమ్మనూరుకు టిడిపి టికెట్టు ఇస్తే ఇక్కడ అరాచకాలు జరుగుతాయని ప్రజలు, కార్యకర్తలు భయపడుతున్నారని అన్నారు.
Latest News