|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:40 AM
అనకాపల్లి సమీపంలోని కొత్తూరు పంచాయతీ దేవీనగర్‌లో సన్యాసిరావు, సింహాద్రమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు గణేష్, కోడలు పూర్ణ పొరుగింటిలో ఉంటున్నారు. తరచూ అత్తా కోడళ్ల మధ్య గొడవలు జరుగుతుండేవి.
సోమవారం ఇంట్లోకి కోతులు వచ్చిన విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. సింహాద్రమ్మ(65)ను పూర్ణ రాయితో తలపై కొట్టి, పరారైంది. సింహాద్రమ్మను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.