|
|
by Suryaa Desk | Sat, Feb 10, 2024, 01:05 PM
చచ్చు సలహాలు ఇస్తూ.. ప్రభుత్వ సలహాదారుగా రూ.140 కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్మును మింగేసిన సజ్జల రామకృష్ణారెడ్డీ..ఇకనైనా సోది డైలాగులు మానుకోవాలని టీడీపీ బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి హితవుపలికారు. నిధుల కోసం సీఎం జగన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లాడని సజ్జల సోది మాటలు చెబుతు న్నాడన్నారు. విజయవాడ ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో గురుమూర్తి మాట్లాడారు. మేనిఫెస్టోలోని హామీలను వైసీపీ ప్రభుత్వం ఎంత బాగా అమలు చేసిందో మద్య నిషేధం, ప్రత్యేక హోదా అంశాలను చూస్తే తెలుస్తోందన్నారు. ఇంకా ఏదో ఉద్దరించామని చెబితే ప్రజలు చీపుళ్లతో కొడతారని ఆయన హెచ్చరించారు. ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఊడ్చేశా రన్నారు. ఇప్పుడు తన కుటుంబ చిచ్చును జగన్‌రెడ్డి రాష్ట్రానికి ఆపాదిం చడాన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు.
Latest News