అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
 

by Suryaa Desk | Sat, Feb 10, 2024, 01:04 PM

అప్పుల బాధ తాళలేక కౌలురైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగ్గయ్యపేట మండలంలోని రామచంద్రునిపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రునిపేటకు చెందిన కౌలు రైతు పద్మాల రాము (35) నాలుగెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, పత్తి సాగు చేశాడు. రూ.ఐదు లక్షల వరకు అప్పులు అయ్యాయి. పంట దిగుబడులు రాక, అప్పుల వత్తిళ్లు తట్టుకోలేక బుధ వారం ఉదయం తాను సాగు చేస్తున్న పొలంలోనే పురుగు మందు తాగి అపస్మా రక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు జగ్గయ్యపేట ప్రభుత్వా స్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయ వాడ తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు.

Latest News
Two killed in US military strike on 'drug boat' in Pacific Sat, May 09, 2026, 11:03 AM
'New dawn of trust': Nitin Nabin ahead of BJP govt formation in Bengal Sat, May 09, 2026, 10:48 AM
Messi backs Neymar for World Cup return Sat, May 09, 2026, 10:39 AM
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM