|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 04:17 PM
భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించడంపై సీఎం జగన్ హర్హం వ్యక్తం చేశారు. "రాజనీతిజ్ఞుడైన పీవీ నరసింహారావుకి భారతరత్న ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ గౌరవం.
రైతుల కోసం పాటుపడిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా భారతరత్న ప్రకటించడం యావత్ జాతి గర్వించదగ్గ విషయం." అని సీఎం పేర్కొన్నారు.