|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 01:35 PM
బీజేపీతో చంద్రబాబు చర్చలపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో చంద్రబాబు అర్థరాత్రి చర్చల కారణమేంటి ? అని ప్రశ్నించారు.
2014లో బీజేపీ రాష్ట్రానికి అవసరం అన్న చంద్రబాబు 2019 వరకు కలిసి ఉండి చివర్లో మోసం చేసిందని బీజేపీని తిట్టారని ఎద్దేవా చేశారు. మళ్ళీ కలిసి పోటీ చేయటంపై చర్చలు ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాలని నాని డిమాండ్ చేశారు.