|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 01:32 PM
అనంతపురం, పుట్టపర్తిలో వైసీపీ అసమ్మతి నేతలను ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి టార్గెట్ చేశారు. అసమ్మతి నేతల గ్రూపులో కీలకంగా ఉన్న లోచర్ల విజయభాస్కర్ రెడ్డి తండ్రి పెద్దారెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన స్మారక స్తూపంతో పాటు పెద్దారెడ్డి విగ్రహం ధ్వంసంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. విగ్రహ ధ్వంసం.. పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంటే శ్రీధర్ రెడ్డి పనేనని వైసీపీ అసమ్మతి నేత లోచర్ల విజయభాస్కర్ రెడ్డి అంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తనను ఎదుర్కోలేక తన అనుచరులతో తన తండ్రి విగ్రహం ధ్వంసం చేయించాడంటూ మండిపడుతున్నారు. ఇక తాడోపేడో తేల్చుకోవడానికి తాము సిద్ధమని.. ఇక ఊరుకొనే ప్రసక్తే లేదని లోచర్ల విజయ భాస్కర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు.
Latest News