|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 12:06 PM
తమ కోర్కెలు సాధనకు చలో విజయవాడ కార్యక్రమానికి వెళుతున్న ఆశ కార్యకర్తలను ప్రభుత్వం నిర్బంధించడం సరైనది కాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము అన్నారు.
గురువారం అచ్యుతాపురం జంక్షన్లో చేపట్టిన నిరసనలో ఆయన మాట్లాడుతూ విజయవాడలో జరిగే కార్యక్రమానికి వెళ్లకుండా ఆశ కార్యకర్తలతో పాటు సీఐటీయూ నాయకులను బుధవారం నిర్బందించడం అప్రజాస్వామికమన్నారు. ఆశ కార్యకర్తలు న్యాయమైన కోర్కెలు తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు.