|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 10:44 AM
శింగనమల మండల కేంద్రంలో వెలసిన హజరత్ సయ్యద్ సాలార్ మసూద్ గాజి దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని శుక్రవారం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. మండల కేంద్రంలో హజరత్ మసూద్ గాజి ఉరుసు ఘనంగా నిర్వహించారు. పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి దంపతులు దర్గా చేరుకుని గాజి సమాధిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Latest News