|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 10:41 AM
ప్రధాని నరేంద్ర మోడీతో ఇవాళ ఏపీ సీఎం జగన్ భేటీ కానున్నారు. నిన్న రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు, పలు అభివృద్ధి అంశాలపై ఆయన మోడీతో చర్చించనున్నారు.
ఉదయం 11 గంటలకు ప్రధానితో భేటీ సమావేశం కానున్నట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా జగన్ కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.