|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 07:39 PM
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ గెలుపుకోసం కుటుంబ సారధులని నియమించాలని నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ సూచించారు. గురువారం గుత్తి పట్టణంలో టిడిపి నాయకులతో కలిసి వార్డుల్లో పర్యటించారు. అనంతరం టిడిపి ముఖ్య నేతలతో సమావేశమై కుటుంబ సారథులను త్వరగా నియమించాలని సూచించారు. వచ్చే ఎన్నికలలో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా కృషి చేసి టిడిపి పార్టీని గెలిపించుకుందామన్నారు.
Latest News