|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 11:15 AM
కేంద్రం వైఖరికి నిరసనగా కేరళ సీఎం విజయన్ ఢిల్లీలో ఇవాళ ధర్నా చేపట్టనున్నారు. ఆందోళనలో తన సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు.
కేంద్రంలోని మోదీ సర్కారు సహకార సమాఖ్య వ్యవస్థను బలహీనం చేసిందని ధ్వజమెత్తారు. కేంద్రం వివక్ష కారణంగా రాష్ట్ర సంక్షేమ పథకాలపై ప్రభావం పడుతుందన్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడుకొనేందుకు బీజేపీయేతర పార్టీలు, సీఎంలు ఈ ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.