అంగన్వాడీలకి కేంద్రం ఎంతో మేలు చేస్తుంది
 

by Suryaa Desk | Thu, Feb 08, 2024, 10:57 AM

కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు అందిస్తున్న గౌరవ వేతనం 2018, అక్టోబర్ 1 నుంచి పెంచినట్లు మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ తెలిపారు. అంగన్వాడీ వర్కర్లకు రూ. 3 వేలు నుంచి రూ. 4500 వరకు, మిని సెంటర్ల అంగన్వాడీ వర్కర్లకు రూ.2250 నుంచి రూ.3500 వరకు, అలాగే అంగన్వాడీ హెల్పర్లకు రూ.1500 నుండి రూ.2250 వరకు పెంచినట్లు తెలిపారు. ప్రతిభ ఆధారిత ప్రోత్సాహం కింద హెల్పర్లకు నెలకు రూ. 250, వర్కర్లకు రూ.500 అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంగన్వాడీ సేవలను ప్రోత్సహిస్తూ తమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సాక్షం అంగన్వాడీ, పోషన్ 2.0 మార్గదర్శకాల ప్రకారం 50 శాతం సూపర్వైజర్ పోస్టులు   5 సంవత్సరాలు అనుభవం కలిగిన వర్కర్లతో అలాగే 50 శాతం అంగన్వాడీ వర్కర్ల పోస్టులు 5 సంవత్సరాలు అనుభవం కలిగిన హెల్పర్లతో భర్తీ చేస్తూ అంగన్వాడీలకు ఉద్యోగోన్నతి కల్పిస్తున్నట్లు శ్రీమతి ఇరానీ తెలిపారు. అంగన్వాడీలకు 20 రోజులు వార్షిక సెలవులకు అదనంగా 180 రోజులు మెటర్నిటీ, 40 రోజులు అబార్షన్/ మిస్ క్యారేజ్  పెయిడ్ లీవ్‌ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. సామాజిక భద్రత బీమా పథకాల కింద వారికి జీవిత బీమా, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మన్ ధన్ యోజన పథకం కింద వాలంటరీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంకు అర్హులైన అంగన్వాడీలను నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కోరినట్టు మంత్రి తెలిపారు. డిజిటల్ సేవలు, పారదర్శకత ప్రోత్సహించేలా అంగన్వాడీలకు ట్యాబ్‌లు అందించి ఇంటర్నెట్ సౌకర్యం కోసం ఏడాదికి రూ.2 వేలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.  దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్ 31 నాటికి 13,48,135 అంగన్వాడీ వర్కర్లు, 10,23,068 హెల్పర్లు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 55188  అంగన్వాడీ వర్కర్లు, 42097 హెల్పర్లు ఉన్నట్లు మంత్రి తెలిపారు.  అంగన్వాడీ సేవలు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం అయినప్పటికీ పథకం అమలు చేసే బాధ్యత ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలదే.  అలాగే మినీ అంగన్వాడీ సెంటర్లు ప్రధాన అంగన్వాడీ సెంటర్లుగా ఉన్నతీకరిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే 2024-25 మధ్యంతర బడ్జెట్ లో ఆయుష్మాన్ భారత్ స్కీం కింద అంగన్వాడీలను చేరుస్తూ రూ. 5లక్షలు ఫ్యామిలీ హెల్త్ కవరేజ్ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Latest News
Pakistan's political system fails to allow women to lead Sun, Apr 12, 2026, 05:29 PM
Asha Bhosle was an iconic voice in Indian cinema: Pawan Kalyan Sun, Apr 12, 2026, 05:25 PM
Women's participation in flexi IT jobs rises to 40 pc in FY26: Report Sun, Apr 12, 2026, 05:19 PM
Asha Bhosle's 'immortal songs will forever resonate in our hearts': Union Ministers Sun, Apr 12, 2026, 05:09 PM
No deal in US-Iran talks, says JD Vance Sun, Apr 12, 2026, 04:35 PM