|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 07:38 PM
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలో తారు డబ్బాలో ఇరుక్కుని ఓ వ్యక్తి ఇబ్బందిపట్టాడు.. రెండు రోజుల పాటూ నరకం అనుభవించాడు. తారు డబ్బాలో పడి గాయాలపాలైన కార్మికుడిని పోలీసులు కాపాడారు. విజయవాడ గ్రామీణ మండలంలో ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో రాయనపాడు దగ్గర రోడ్డు పనులు జరుగుతున్నాయి. బీహార్‌కు చెందిన కార్మికుడు అక్కడ పని చేస్తూ సోమవారం ప్రమాదవశాత్తు తారు డబ్బాలో జారి పడిపోయాడు. ఈ విషయాన్ని అక్కడున్నవారు ఎవరూ గమనించలేదు.
అయితే కార్మికుడు డబ్బాలో పడిపోయిన కార్మికుడు పెద్దగా కేకలు వేయడంతో మంగళవారం మధ్యాహ్నం స్థానికులు కొందరు విని అక్కడికి వెళ్లారు. అతడ్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినా వీలుపడలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని స్థానికుల సాయంతో తారు డబ్బా నుంచి కార్మికుడిని అతి కష్టంపై బయటకు తీశారు. శరీరం స్వల్పంగా కాలడంతో చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News