|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 11:40 AM
పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం సమీపంలో నలంద డిగ్రీ కళాశాల సమీపంలో జాతీయ రహదారి పై బుధవారం కారు ఢీ కొన్న సంఘటనలో హనుమాపురంకు చెందిన జయలక్ష్మీ (37), అక్షర (5) అనే తల్లీ కూతుళ్లు మృతి చెందారు. జయలక్ష్మీ తన కూతురుతో కలిసి పొలంకు వెళ్తూ రోడ్డు దాటుతుండగా ఆదోని నుండి ఎమ్మిగనూరు వైపు వెళుతున్న కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో తల్లీ కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. హనుమాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Latest News