|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 01:45 PM
మంగళవారం తెల్లవారుజామున తిరుపతి, నాయుడుపేట- పూతలపట్టు ప్రధాన రహదారిలోని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాజీ డైరీ ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. తిరువన్నామలై నుండి తిరుమలకు వెళుతున్న చిత్తూరు డిపోకు చెందిన బస్సులో 42 మంది ప్రయాణిస్తుండగా 27 మందికి గాయాలయ్యాయి. టిప్పర్ లారీ ఎదురుగా రావడంతో బస్సు డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతో బోల్తా పడింది. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై తిరుపతి రూరల్ ఎస్ఐ నాగేంద్రబాబు కేసు నమోదు చేసి.. విచారిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Latest News