|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 01:44 PM
‘‘నిజం గెలవాలి’’ పేరుతో భువనేశ్వరి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. హఠాన్మరణం చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఓదారుస్తూ.. అండంగా ఉంటామంటూ భరోసా ఇస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి 4 రోజుల పాటు నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన చేయనున్నారు. ఈరోజు గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తారు. బుధవారం (7వ తేదీ) తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. గురువారం (8వ తేదీ) తాడికొండ నియోజకవర్గంలో పర్యటిస్తారు. 9న (శుక్రవారం) నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఆమె పర్యటిస్తారు. భువనేశ్వరి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను టీడీపీ ఖరారు చేసింది.
Latest News