|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 01:41 PM
చిత్తూరు పార్లమెంట్‌లోని గంగాధర నెల్లూరు సమీపం రామానాయుడుపల్లె బస్టాప్ వద్ద మంగళవారం జరిగే ‘రా.. కదలిరా’ బహిరంగ సభ కోసం చంద్రబాబు మధ్యాహ్నం 2.50 గంటలకు రామానాయుడుపల్లె హెలిప్యాడ్‌కు వస్తారు. అక్కడ్నుంచి 3 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు బహిరంగసభ జరుగుతుంది. అనంతరం 4.35 గంటలకు 4.45 రామానాయుడుపల్లె హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 5.10 గంటలకు విమానంలో విజయవాడకు బయలుదేరుతారు. వైసీపీ దౌర్జన్యాలను, బెదిరింపులు, కేసులను ఎదుర్కొంటూ జిల్లాలో తెలుగుదేశం పార్టీ మళ్లీ మహాశక్తిగా ఆవిర్భవిస్తోంది. ప్రజల్లో జగన్‌రెడ్డి ప్రభుత్వంపై పెరుగుతున్న ఆగ్రహం, అసంతృప్తి తెలుగుదేశం శ్రేణులకు మరింత శక్తిని ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు గంగాధరనెల్లూరులో చంద్రబాబునాయుడు బహిరంగ సభ జరగనుంది. ప్రజల సంక్షేమానికి హామీలూ, పార్టీ కార్యకర్తలకు భరోసా ఈ వేదిక మీదనుంచి చంద్రబాబు బలంగా ప్రకటిస్తారని భావిస్తున్నారు.
Latest News