|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 02:34 PM
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగం అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది.
అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. నాలుగు రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. దీంతో ఈనెల 8 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.