|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 02:33 PM
టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని ప్రశ్నించింది.
ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేట్లు లేదని పేర్కొంది. దీనిపై వివరాల సమర్పణకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో విచారణను మంగళవారానికి వాయిదావేసింది.