|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 09:33 AM
2024లో జనసేన-టీడీపీ ప్రభుత్వం స్థాపిస్తాం. కష్టమే అయినా పోరాటం చేయాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.అయన మాట్లాడుతూ.... విజయం తేలికేం కాదు. జగన్ ఎన్ని మోసాలు చేసినా, మాయలు చేసినా వాటన్నింటినీ అధిగమించి మనం ప్రభుత్వాన్ని స్థాపించాలి. పొత్తుల్లో కొంత కష్టం ఉంటుంది. ఏదేమైనా అసెంబ్లీలో జనసేన చాలా బలమైన ముద్ర వేస్తుంది. దీనిలో బాగంగానే ప్రతి సీటు గెలిచే సీటవ్వాలి. జగన్ అనే దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోకపోతే భవిష్యత్తును మనం ఊహించలేం. ఎలాంటి నాయకులు వచ్చినా జనసేన తరఫున మద్దతుగా నిలవండి. నాయకులు పడ్డ ప్రతి కష్టానికీ గుర్తుపు వచ్చే లా అందరినీ దృష్టిలో పెట్టుకుంటాం అని అన్నారు.
Latest News