|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 09:21 AM
సీఎం జగన్ రెడ్డి ఎన్నికల హామీలను ఎండగడుతూ... ‘ప్రజాకోర్టు’ పేరుతో ఛార్జ్ షీట్ పేరుతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. సీఎం చెబుతున్న 99 శాతం హామీల అమలు అనేది పెద్ద బూటకమన్నారు. అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్‌కు ప్రజాకోర్టులో శిక్ష ఖాయమని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఊరూరా తిరిగి అడ్డగోలుగా హామీలిచ్చి... అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని మండిపడ్డారు. మొత్తం 730 హామీల్లో 21 శాతం కూడా అమలు చేయకుండా... 99 శాతం అమలు చేశానంటూ ప్రజలను జగన్ వంచిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
Latest News