|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 06:49 PM
నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని సీఎం జగన్ అనేంతటివాడివా నువ్వు... ముందు నీ బతుకేంటో చూసుకో అని పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆర్క్ రోజా ఘాటుగా విమర్శించారు. జగన్ కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఇప్పటిదాకా వార్డు మెంబర్ గా కూడా గెలవలేకపోయాడని రోజా ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల జెండాలు మోసే కూలీ పవన్ కల్యాణ్ అని, తన స్థాయికి మించి మాట్లాడడం తగదని హితవు పలికారు. జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న మంగళగిరిలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ 13 ఏళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చి రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచారని, మరో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారని రోజా వెల్లడించారు. జగన్ ఒకసారి విపక్ష నేతగా ఉన్నారని, ఆ తర్వాత 151 మంది ఎమ్మెల్యేల బలంతో సీఎం పీఠం అధిష్ఠించారని వివరించారు.
Latest News