లక్షల కోట్లు విలువ చేసే కంపెనీలు జగన్ కు ఉన్నాయి....పీతల సుజాత
 

by Suryaa Desk | Sun, Sep 17, 2023, 06:35 PM

చంద్రబాబుకు హెరిటేజ్ మాత్రమే ఉందని, కానీ జగన్ కు అధికారికంగా, అనధికారికంగా లక్షల కోట్లు విలువ చేసే కంపెనీలు ఉన్నాయని టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి పీతల సుజాత  ఆరోపించారు. 2004లో కేవలం రూ.కోటి 73 లక్షల ఆస్తి మాత్రమే కలిగివున్న జగన్ నేడు లక్షల కోట్లకు అధిపతిగా ఎలా ఎదిగాడు? అని పీతల సుజాత ప్రశ్నించారు. "జగన్ అభినవ దుర్యోధనుడిలా చెలరేగిపోతున్నాడు. జగన్ కు పక్క రాష్ట్రం నుంచి సపోర్టు ఉంది. సాక్షి, ఇతర ఛానళ్ల బలముంది... రౌడీలు, మాఫియాల మద్దతు ఉంది. లక్షల కోట్ల నల్లధనం ఉన్న జగన్ తాను ఒంటరివి అనడం ప్రజల్ని మోసం చేయడమే. జగన్ పీఠం త్వరలోనే కూలనుంది. తన లక్షల కోట్ల అవినీతి, లూటీని కప్పిపుచ్చుకునేందుకు ఎదుటివారిపై బురదజల్లుతున్నాడు" అని మండిపడ్డారు.


"అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయానికి చిరునామాగా ఉన్న చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి, అన్యాయంగా అరెస్టు చేయడమే కాకుండా, ఆయనపై దుష్ప్రచారాలు చేస్తున్నారు. ప్రజల వద్ద సానుభూతి పొందాలని ‘‘నేను ఒంటరివాడిని, సత్యహరిశ్చంద్రుడి’’నని మాట్లాడుతున్నాడు. నేడు రాష్ట్రంలో హై కరప్టెడ్ అధికారులందరూ జగన్ పక్కనే ఉన్నారు. నీ దొంగ నాటకాలకు ప్రజలు మరోసారి మోసపోవటానికి  సిద్ధంగా లేరు. తగిన గుణపాఠం చెబుతారు. 


ఏ ఆధారాలు లేకుండా ఒక్క రూపాయి అవినీతి చేయని వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపారు. రాష్ట్ర ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైంది. ఇక తెలుగు ప్రజల్ని ఆపటం జగన్ తరం కాదు. టీడీపీ, చంద్రబాబే మీ టార్గెట్ అని అర్థమౌతోంది. టీడీపీ బలహీనపడుతుందనుకున్నారు. మేం మరింత స్ట్రాంగ్ అయ్యాం. తెలుగుదేశం సైనికులు ఇంకాస్త బలపడ్డారు. ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. వారిలో ఆవేశం కట్టలు తెంచుకొస్తోంది. 


రాజమండ్రిలో భువనేశ్వరి, బ్రాహ్మణిలు కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తుంటే మహిళలు వేలాదిగా తరలి వచ్చారు. బెంగళూరు, హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు బయటికొచ్చి ధర్నాలు చేస్తున్నారు. లోకేశ్ యువగళానికి సిద్ధమౌతుంటే వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఆయన సంకల్ప బలంతో పాదయాత్ర నిర్వహించారు. ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోబోతున్నారు" అని పీతల సుజాత పేర్కొన్నారు.


Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM