|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 04:46 PM
కొలంబోలో ఆదివారం శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్ సిరాజ్ చెలరేగాడు. సంచలన బౌలింగ్‌తో ఒకే ఓవర్‌లో నలుగురు శ్రీలంక బ్యాటర్లను ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతికి నిశాంకను, మూడో బంతికి సమరవిక్రమను, నాలుగో బంతికి అసలంకను, ఆరో బంతికి ధనంజయ డి సిల్వాను ఔట్ చేశాడు. ప్రస్తుతం శ్రీలంక 5 ఓవర్లలో 12 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో ఉంది.
Latest News