|
|
by Suryaa Desk | Sun, Sep 17, 2023, 11:18 AM
గుంటూరు పట్టణం శ్రీనగర్ కు చెందిన యువతి బ్రాడీపేటలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అదే కళాశాలకు చెందిన బస్సు డ్రైవర్ గేరా జగన్, అతని మిత్రులు బాలాజీ, గోపీచంద్ లు ఆమె వెంట పడి వేధిస్తున్నారు. దీంతో యువతి సోదరుడి మిత్రలు గేరా జగన్, బాలాజీ, గోపిచంద్ ను కొట్టారు. శనివారం ఇరువర్గాలు పోలీసు స్టేషన్ లో పరస్పర ఫిర్యాదు చేసుకున్నాయి. పోలీసులు రెండువైపులా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు.
Latest News