|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 04:18 PM
కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ రాయపాటి నాగమణిబాబు జల జీవన్ పథకం క్రింద ఇంటింటికి కుళాయిలు వేయించారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కరించి ప్రతి ఇంటింటికి త్రాగునీరు అందించేందుకు జగనన్న సంక్షేమ పథకాలు అందిస్తూ జల జీవన్ ద్వారా ప్రజలకు మరింత సేవ అందించడానికి శ్రీకారం చుట్టామన్నారు. గ్రామ పెద్దలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News