|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 02:53 PM
జగన్మోహన్ రెడ్ది ద్వారా పునర్జన్మ పొందాను అని అడ్వకెట్ సుధాకర్ రెడ్ది చెప్పడం హాస్యాస్పదమని వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సుధాకర్ రెడ్డి ప్రభుత్వ న్యాయవాదిగా తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటున్నారని విమర్శించారు. అదనపు అడ్వకెట్ జనరల్ అయినా.. తన సేవలు జగన్మోహన్ రెడ్డీకే అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం దగ్గర వసతులు, జీతబత్యాలు పొందుతూ జగన్మోహన్ రెడ్ది సేవకుడిని అని చెప్పడం హేయమన్నారు. సుధాకర్ అదనపు అడ్వకెట్ జనరల్ జనరల్ కంటే.. వైసిపీ కార్యకర్త అని చెప్పుకోవచ్చని వ్యాఖ్యలు చేశారు.
Latest News