|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 02:52 PM
నేడు అనగా శనివారం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది అనే చెప్పొచ్చు. స్వామివారి దర్శనం కోసం కేవలం ఒక కంపార్ట్‌మెంటులో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం 62357 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పరణ జరగనుంది.
Latest News