|
|
by Suryaa Desk | Sat, Sep 16, 2023, 12:22 PM
ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి శుక్రవారం విజయనగరం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న బాధితులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దారిద్య్ర రేఖకు దిగువ కుటుంబాలకు చెందిన వారమని వైద్యానికి, చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం కావాలని విన్నవించుకున్నారు. వారి సమస్యలను ముఖ్యమంత్రితో మొర పెట్టుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Latest News